ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి వేడికి ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో నీరసం. అయితే ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ఫ్రూట్ జ్యాస్ తాగుదామని ఓ వ్యక్తి సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు వెళ్లాడు. స్టోర్‌లోని ఫ్రిజ్‌లో నుంచి ఓ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని.. బిల్లు చెల్లించాడు. తీరా ఫ్రూట్ జ్యూస్‌ను ఆస్వాదిద్దామని ఓపెన్ చేసే సరికి ఫ్రూట్ జ్యాస్ బాటిల్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన సదరు వ్యక్తి ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన విజయవాడలోని కుమ్మరిపాలెం రిలయన్స్ స్టోర్‌లో చోటు చేసుకుంది. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు కుమ్మరిపాలెం రిలయన్స్ స్టోర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఫిర్యాదుతో తనిఖీలు చేసాం, పంచనామా తర్వాత యాక్షన్ తీసుకుంటామన్నారు. గత కొద్ది రోజులుగా ఐదు రెస్టారెంట్‌లపై రైడ్స్ చేసి సీజ్ చెయ్యటం జరిగిందని ఆయన వెల్లడించారు. కల్తీ ఆహారాన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నామన్నారు.
https://ntvtelugu.com/dr-care-world-homeopathy-day-special-event/
