NTV Telugu Site icon

ఎస్.ఎస్.సీ బోర్డ్ లో మహిళ ఉద్యోగుల ఆందోళన…

ఏపీ ఎస్.ఎస్.సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సెక్సువల్ గా వేధిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు మహిళ ఉద్యోగులు. గట్టిగా మాట్లాడితే సస్పెండ్స్ చేస్తున్నారంటూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన ఓ సూపరిండెంట్ పై చేయి చేసుకుని, సస్పెండ్ చేసారు సుబ్బారెడ్డి. ఎస్.ఎస్.సీ బోర్డ్ పరువు కాపాడాలి… మహిళలను రక్షించాలి అంటూ నిరసన చేస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మహిళ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారని.. అలాగే అబ్బాయిలు వుండే సెక్షన్స్ లో మహిళలను వేసి వేధిస్తున్నారని అంటున్నారు. గత మూడేళ్ళుగా భరించం, ఇక భరించలేం అంటున్నారు మహిళ ఉద్యోగులు. పై అధికారులకు కంప్లైట్ చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తే ఎస్.ఎస్.సీ బోర్డ్ మహిళలు ఏమైనా చేస్తారు అంటూ ప్రశ్నించారంటూ తెలిపారు. గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎవ్వరు లెక్క చెయ్యటం లేదంటూ మండిపడుతున్న సిబ్బంది… ఈ విషయం పై గతంలో మహిళ చైర్ పర్సన్ కి కంప్లైన్ట్ చేసారు మహిళ సిబ్బంది.