Site icon NTV Telugu

రంగవల్లుల రూపంలో ‘థాంక్యూ సీఎం సార్’

ఇటీవల ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో గ్రామ, వార్డు సచివాలయాల మహిళలను భాగస్వామ్యం చేస్తూ అనేక వరాలు కురిపించిన సీఎం జగన్‌కు చిత్తూరు జిల్లా మహిళలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: కోహ్లీ ప్రకటనపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

ఈ మేరకు చిత్తూరు పట్టణ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు సంక్రాంతి పండగ సందర్భంగా తమ లోగిళ్ళలో ప్రత్యేకంగా ముగ్గులు వేసి ‘థ్యాంక్యూ సీఎం సార్’, థ్యాంక్యూ డీజీపీ సార్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు వారి లోగిళ్లలో సంక్రాంతి శోభను ఏటా మోసుకొచ్చే కొత్త పంటలా ఈ కొత్త సంవత్సరం తమ ఆశల పంటగా సరికొత్త జీవో ఇచ్చారంటూ తమ సంతోషాన్ని, ఆనందాన్ని రంగవల్లుల రూపంలో వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version