కడప నగరానికి సమీపంలోని వైఎస్‌ఆర్ లేఅవుట్‌లో పాలు అమ్ముకుని జీవించే సాత్విక అనే వివాహిత గత ఆదివారం ఓ కామాంధుడి చేతిలో దాడికి గురైంది. ఉదయం పాలు పోసి వస్తుండగా అదే కాలనీకి చెందిన కిరణ్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనై ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు కిరణ్. ఈ ఘటనలో సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేయగా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది బాధితురాలు.
Read Also: Jogi Ramesh: కుప్పం నుంచి స్టార్ట్.. 175 నియోజకవర్గాల్లో తిరుగుబాటే..!
కిరణ్‌కు సహకరించకపోవడం వల్లే తనపై దాడి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనతో తనకు జీవనాధారం లేకుండా పోయిందని పోలీసులే న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధితురాలు. సాత్వికకు ఇద్దరు సంతానం ఉన్నారు. మరోవైపు.. ఇప్పటికే ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిఎస్పీ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితురాలి కుటుంబీకులు. ఈ దుండగుడ్ని కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు స్థానికులు.