Site icon NTV Telugu

కార్తీక దీపారాధనలో అపశ్రుతి.. మహిళ చీరకు అంటుకున్న మంటలు

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది.

తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది. దీంతో సుహాసినికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఆమెను గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం సుహాసినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Read Also: జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటర్: నారా లోకేష్

Exit mobile version