Gottipati Ravi Kumar: భీమవరంలో జిల్లాలోని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కూటమి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇక, మంత్రి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో ప్రధానంగా చర్చించారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు ఎమ్మెల్సీలు గెలిచామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….
అయితే, నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి అని మంత్రి గొట్టిపాటి రవి చెప్పారు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ప్రచారానికి ఉపయోగించుకోవాలి అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికలను బాధ్యతగా తీసుకోవాలి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తాం.. వచ్చే విద్య సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా అంతజేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తెస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.