నేడు వర్చువల్ గా జీఆర్ ఎంబీ సబ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై కమిటీ చర్చించనుంది.
నేడు కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కడప జైలులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి పరామర్శించనున్నారు.
నేడు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది.
మహారాష్ట్రలో నేటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో విద్యా సంస్థలను నేటి నుండి పునః ప్రారంభిచనుంది. అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులకు కూడా ప్రభుత్వం అనుమతించింది.
నేటి నుంచి తెలంగాణాలో 8,9,10 తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ మరోసారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాఠశాలకు హాజరుకావాలని సూచించింది.
విద్యుత్ టారిఫ్ లపై నేటి నుంచి ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. డిస్కం చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయం సేకరించనుంది.