నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి అమోదించనుంది. రూ. 3,171 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు.
నేడు ఢిల్లీలో హోంశాఖ సబ్ కమిటీ భేటీ కానుంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకి హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో భేటీ కానున్నారు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,800 లుగా ఉంది.
నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ ఏపీలో రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం జగన్ పాల్గొనన్నున్నారు. అలాగే మధ్యాహ్నం 12.15 గంటలకు ఇందిరా స్టేడియంలో ఫోటో ప్రదర్శన నిర్వహించనున్నారు.
నేడు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్‌డే ఏర్పాట్లు చేశారు.
నేడు మేడ్చల్‌లోని కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్ నిర్మించనున్నారు.
నేడు అమరావతిలో సినిమా టికెట్ల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు కమిటీ భేటీ కానుంది.