1. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం వరిధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
2. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను పెంచింది. అయితే పెరిగిన బస్సు చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. డీజిల్ సెస్, సెఫ్టీ సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలతో కలిసి కనిష్ఠ ధర రూ.10 పెరిగే అవకాశం ఉంది.
3. నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
4. నేటి నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. అలంపూర్ జోగులంబ నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
5. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద నిరసనలు తెలియజేయనున్నారు.
