* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పులపై చర్చించే అవకాశం.. కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు..
* నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్..
* నేడు కాళేశ్వరం కమిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ.. చీఫ్ జస్టిస్ బెంచ్లో విచారణకు రానున్న కేసీఆర్, హరీష్రావు పిటిషన్లు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్రావు..
* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ కసరత్తు.. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం షెడ్యూల్ విడుదల.. ఇవాళ రాజకీయ పార్టీలతో ప్రత్యేకాధికారి సమావేశం.. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు ఓటర్ సవరణ కార్యక్రమం..
* నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
* నేడు మార్కాపురంలో శ్రీశైలం శిఖరం వద్ద దోర్నాల అటవీ శాఖ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరుల దాడిని ఖండిస్తూ ఫారెస్ట్ రేంజ్ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర అటవీ శాఖ యూనియన్ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..
* నేడు సినీ కార్మికుల సమ్మెపై కీలక భేటీ.. నిర్మాతలు, ఫెడరేషన్ తో భేటీకానున్న ఫిల్మ్ ఛాంబర్..
* నేడు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు.. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్..
* నేడు మదురైలో విజయ్ టీవీకే పార్టీ బహిరంగ సభ.. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై ప్రకటన చేసే అవకాశం..
* నేడు వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రెస్ మీట్.. అంతరిక్ష విశేషాలను పంచుకోనున్న శుభాంశు శుక్లా..
