Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో, స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం.. మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవం..

* నేడు విశాఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యాటన.. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సు.. స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్న నిర్మలా సీతారామన్..

* నేడు గుంటూరులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన.. వెస్ట్ బైపాస్ పనులు పరిశీలించనున్న పెమ్మసాని.. మార్కెట్ యార్డ్ పని తీరుపై సమీక్షించనున్న చంద్రశేఖర్..

* నేడు బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి.. ఉద్దండరాయునిపాలెంలో విశ్వకర్మ జయంతి సభ.. సభకు హాజరుకానున్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్..

* నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో, సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు..

* నేడు ఖమ్మం పరేడ్ గ్రౌండ్ లో ప్రజాపాలన వేడుకలు.. పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

* నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు.. తెలంగాణ వ్యాప్తంగా 3,159 వైద్య శిబిరాలు.. మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్.. అమీర్ పేటలో ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహా..

* నేటి ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్ కి కేటీఆర్.. జాతీయ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట బీఆర్ఎస్ కార్యక్రమం..

* నేటి ఉదయం 11 గంటలకు కాళేశ్వరంపై బీఆర్ఎస్ డాక్యుమెంటరీ.. కాళేశ్వరంపై డాక్యుమెంటరీ విడుదల చేయనున్న కేటీఆర్..

* నేడు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు.. ఉదయం 8గంటలకి పరేడ్ గ్రౌండ్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్..

* నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు.. ఇప్పటికే ఏపీలోని ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ బంద్..

* నేడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు విచారణ..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..

* నేడు ప్రధాని మోడీ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా ఘనంగా బర్త్ డే వేడుకలకు సిద్ధమవుతున్న బీజేపీ నేతలు..

* నేడు మధ్యప్రదేశ్ లో తన 75వ బర్త్ డే వేడుకలను జరుపుకోనున్న ప్రధాని మోడీ..

* నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర పున: ప్రారంభం.. భారీ వర్షాలతో కొద్ది రోజులగా యాత్ర నిలిపివేత..

* నేడు ఆసియా కప్ లో పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ.. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్..

Exit mobile version