Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

1) నేడు మూడోరోజు పార్లమెంట్ సమావేశాలు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం ప్రకటన చేసే అవకాశం
2) హైదరాబాద్‌: నేడు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల అంత్యక్రియలు.. హాజరుకానున్న ఏపీ మంత్రి పేర్ని నాని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు
3) కృష్ణా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
4) నెల్లూరు: 31వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… నేడు మరపూరు నుంచి ప్రారంభం.. నేడు 12 కి.మీ. మేర సాగనున్న పాదయాత్ర
5) నేడు కృష్ణా జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటన… వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించనున్న బృందం.. మధ్యాహ్నం సీఎం జగన్, వివిధ శాఖలతో భేటీ.. సాయంత్రం పారిశ్రామిక సంఘాలతో సమావేశం
6) ఏపీలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె… టీడీఎస్ మినహాయింపు హామీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపణ.. నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని నిర్ణయం
7) విశాఖ: నేడు సింహాద్రి అప్పన్న సింహగిరిపై కార్తీ తదియారాధన

Exit mobile version