Site icon NTV Telugu

West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్‌ షాక్‌తో భార్య.. కాపాడబోయి భర్త మృతి

Electrocution

Electrocution

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆరో వార్డులో విషాదం చోటు చేసుకుంది. ఇంట దగ్గర మోటార్‌ స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లిన మహిళ విద్యుత్ ఘాతానికి గురైంది. ఇక, ఆమెను కాపాడుపోయిన భర్త కూడా కరెంట్ షాక్‌కు గురయ్యారు.. దీంతో.. ఇద్దరు దంతపులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గట్టిం వెంకన్న (60), అన్నపూర్ణ (50) గా గుర్తించారు. మోటర్ వద్ద వైర్ నుంచి కరెంటు పాస్ అవుతున్న విషయాన్ని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అఇయతే, ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా అన్నపూర్ణకు కరెంట్ షాక్ తాగితే గిలగిలలాడుతున్న సమయంలో ఆమెను కాపాడడానికి వెళ్లిన భర్త ఘట్టం వెంకన్న కు కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Bollywood Actresses: ప్రెగ్నెన్సీతో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్లు వీరే..

Exit mobile version