తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జనాలు ఇక్కట్లు పడుతున్నారు.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది.. మరో రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేత్తనున్నాయి..రాబోయే మూడ్రోజుల్లో అంటే జూలై 3వ తేది సోమవారం నుంచి 5వ తేది వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికి ఆంధ్రా, తెలంగాణలో ఇప్పటికి చాలా చోట్ల చినుక జాడ లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేసవి తాలుక ఎండలతో జనం మాడిపోతున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఇది ఇలా ఉండగా.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని.. అదే సమయంలో వాయువ్య ఉత్తర ప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. హైదరాబాద్ లో వర్షాలు సాయంత్రం లేదా రాత్రి భారీగా కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది..అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయి.. ఇక ఏపీ లో కూడా భారీగా వర్షాలు కురవనున్నాయి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు