ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది.
వీటి ఫలితం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో… ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే… రేపు, ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
