Site icon NTV Telugu

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు మరో సారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీలోనూ రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

Exit mobile version