Site icon NTV Telugu

Vangalapudi Anitha: త్వరలోనే విశాఖలో అవసరమైన ఫ్లై ఓవర్లు నిర్మిస్తాం..

Anitha

Anitha

విశాఖ సెంట్రల్ జైలును ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. గంజాయి కేసులో జైలులో ఉన్న గంజాయి ఖైదీలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెంట్రల్ జైల్లో సిబ్బందికి కనీస వసతలు లేవు.. చిన్న, చిన్న పిల్లలు గంజాయి కేసుల్లో ఖైదీలగా ఉన్నారు.. ఐదు, పది వేల రూపాయలు కోసం పిల్లలు గంజాయి ఖైదీలగా మారుతున్నారు.. గంజాయి స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు.. సెంట్రల్ జైల్లో గంజాయి డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పుకొచ్చారు. త్వరలో అధికారులతో సమీక్ష నిర్వహించి, సిబ్బందికి మంచి చేస్తాం.. ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నాం.. ఖైదీలకు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం.. గంజాయి, డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతామని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Read Also: Asaduddin Owaisi : లోక్‌సభలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఒవైసీ..

త్వరలోనే ఆరిలోవ నూతన పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. దిశ చట్టం లేదు.. దిశ పోలీస్ స్టేషన్ పేరు మార్పు చేస్తామన్నారు. అలాగే, హనుమంతువాక సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ను హోం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంతువాక ఏరియాలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.. గిరి ప్రదక్షణకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.. విశాఖలో ఒకే ఫ్లైఓవర్ ఉండడం దురదృష్టకరం.. త్వరలోనే విశాఖలో అవసరమైన ఫ్లై ఓవర్లు నిర్మిస్తాం.. టూవీలర్స్ పై ప్రయాణించే ప్రయాణికులు హెల్మెట్ వినియోగించాలి.. భద్రత కోసం హెల్మెట్ వాడండి.చలనాలు కోసం కాదు అని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.

Exit mobile version