War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం
- యుద్ధ ప్రభావంతో నిర్మాణ రంగం సంక్షోభం
- సిరామిక్ పరిశ్రమలపై భారీ దెబ్బ
- బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి
- కార్మికులకు ఉపాధి సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ సంక్షోభం ఇప్పుడు నేరుగా సామాన్యుడి సొంతింటి కలపై ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో (Middle East) ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాల్లో గ్యాస్ ఆధారిత సిరామిక్ , యూపీవీసీ (uPVC) పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితంగా బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.
భారతదేశంలో తయారయ్యే సిరామిక్ ఉత్పత్తుల్లో సుమారు 90 శాతం గుజరాత్‌లోనే ఉత్పత్తి అవుతాయి. ఈ పరిశ్రమలకు గ్యాస్ , క్రూడ్ ఆయిల్ అత్యంత కీలకం. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో తయారీ వ్యయం భారీగా పెరిగింది. ముడిసరుకు కొరత , పెరిగిన ఖర్చుల భారాన్ని భరించలేక చాలా ఫ్యాక్టరీలు ఏప్రిల్ 1వ తేదీ నుండి తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. మరికొన్ని చోట్ల ఉత్పత్తి 50 శాతానికి పడిపోయింది.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
తయారీ ఖర్చులు పెరగడంతో డీలర్లు , తయారీదారులు వస్తువుల ధరలను భారీగా పెంచేశారు. టైల్స్, కమోడ్లు, వాష్ బేసిన్లు , ఇతర శానిటరీ వస్తువుల ధరలు 20% నుండి 30% వరకు పెరిగాయి. కొన్ని రకాల వస్తువులపై ఏకంగా 50% వరకు భారం పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?
ధరలు అమాంతం పెరగడంతో కస్టమర్లు షాపులకు రావడం తగ్గించేశారు. వచ్చిన వారు కూడా పాత ధరలకు, కొత్త ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. దీనివల్ల హార్డ్‌వేర్ , శానిటరీ వ్యాపారం పూర్తిగా మందగించిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ వ్యయం రెట్టింపు అవ్వడంతో బిల్డర్లు తమ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ప్లంబింగ్ , ఇతర ఫినిషింగ్ పనులను వాయిదా వేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది ప్లంబర్లు, నిర్మాణ కార్మికులు , రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ తర్వాత నిర్మాణ రంగంలో రెండో అతిపెద్ద మార్కెట్ అయిన విశాఖపట్నంలో ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది.
యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని ప్రభావం మాత్రం ఇక్కడి సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇంధన ధరలను నియంత్రించకపోతే లేదా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గకపోతే నిర్మాణ రంగం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!