అనంతపురంజిల్లా పెనుకొండలో నగర పంచాయితీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తరలివచ్చి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి తానే అన్నీ చూసుకుంటూ దగ్గరుండి నామినేషన్ లు వేయించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతామనే పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకుని అధికారం తో గెలవాలని చూస్తుందన్నారు.
ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ను పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఎన్నికల్లో వారిని ఉపయోగించుకుంటూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెనుకొండ అభివృద్ధి జరిగిందని అసలు ఓట్ అడగాలన్న వైసిపి పార్టీ కి హక్కు లేదని ఎద్దేవా చేశారు.
మంత్రిగా ఉండి రెండున్నర సంవత్సరం పెనుగొండకు ఏం చేశారని తాను తన ఇల్లు నిర్మించుకున్న ప్రదేశంలో మాత్రమే రహదారులు వేసుకొని పబ్బం గడుపుతున్నారన్నారు. అసలు ఈ ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేసిన మహిళలే తెలుగుదేశం పార్టీ కి వచ్చి ఎనిమిదో వార్డ్ గా పోటీలో నిలబడుతున్నారు. ఇంతకంటే ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలని ప్రభుత్వంపై పార్థసారథి మండిపడ్డారు.