Site icon NTV Telugu

Minister Kondapalli: గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు..

Kondapalli

Kondapalli

Minister Kondapalli: విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణానికి నాంది పలకడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని విషయంలో వెనకబడి ఉన్నాం.. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు.. ముందు చూపుతో అమరావతి అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రాజధానితో పాటు ప్రతి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తున్నాం.. రాష్ట్రంలో పరిపాలన సెంట్రలైజ్ చేస్తున్నామని మంత్రి శ్రీనివాసరావు తెలిపారు.

Read Also: Ambati Rambabu: జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు..

ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంను రెండు కళ్లులా చూస్తున్నారు అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇప్పటికే 11 ఎమ్ ఎస్ ఎం ఈ పార్కులు ప్రారంభించాం.. మరో 39 పార్కులు పనులకు నిధులు సిద్ధం చేశాం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని తేల్చి చెప్పారు.

Exit mobile version