Site icon NTV Telugu

Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…

Untitled Design (5)

Untitled Design (5)

వ్యాపారులు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అయితే ఓ చికెన్ సెంటర్ యజమాని విన్నూతంగా అలోచించి ఓ ఆఫర్ పెట్టాడు. రూపాయి నోట్ తీసుకువచ్చిన వారికి.. హాఫ్ కేజీ చికెన్ ఫ్రీ అంటూ.. బోర్డ్ ఏర్పాటు చేశాడు. దీంతో కస్టమర్లు షాపుకు క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Read Also: Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్

పూర్త వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ యజమాని శ్రీనివాసరావు.. తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు విన్నూతంగా ఆలోచించాడు. అనుకున్నదే తరువుగా.. ఒక్క రూపాయి నోట్ తెచ్చిన వారికి.. హాఫ్ చికెన్ ఫ్రీ అంటూ ప్రకటించాడు. దీంతో జనాలు అతడి షాప్ ముందు క్యూకట్టారు. కొందరు 5-10 నోట్లు తెచ్చి చికెన్ తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే దాదాపు వందకు పైగా పాత ఒక రూపాయి నోట్లు షాపు యజమానికి వచ్చాయి.. అయితే ఈ పాత నోట్లతో తాను ఆర్ట్ ఫీసులు తయారు చేసే.. వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు ఓనర్ తెలిపాడు. అయితే ఈ ఆఫర్ పెట్టిన కొద్ది సేపటకే.. తెగ వైరల్ అయిపోయింది.

Exit mobile version