NTV Telugu Site icon

Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో విజృంభిస్తున్న డయేరియా..

Vzm

Vzm

Diarrhea Cases: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విజృంభిస్తుంది. వాంతులు, విరోచనాలతో గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాకపోవడంతో.. వంద మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. కాగా, కలుషిత నీరు తాగడం వలనే డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై కూడా దృష్టి పెట్టిన అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే, గత రాత్రి నుంచి ఇప్పటి వరకు మరో 22 మందికి డయేరియా కేసులు నమోదు అయ్యాయి.. వారు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read Also: CM Chandrababu: ఏపీలో వర్షాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

కాగా, మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరిలించగా.. రోగుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే, డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గుర్ల గ్రామంలో పరిస్థితిపై ఆరా తీశారు. డయేరియాను అదుపు చేసేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించి గ్రామంలో క్లోరినేషన్ జరిపించాలని వెల్లడించారు. గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చే వరకు డాక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చర్యలతో కొంత మేర బాధితులు భాకోలుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.