Home Minister Anitha: ఇప్పుడు అంతా వరి నాట్ల సీజన్.. ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలతో రైతులు పొలం పనుల్లో మునిగిపోతున్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో బావులు, బోరు బావుల నీటి సాయంతో వ్యవసాయం చేస్తున్నారు.. అయితే, నిత్యం కార్యక్రమాలతో బిజీగా ఉండే ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఒక్కసారిగా పొలంలోకి దిగి వరినాట్లు వేశారు..
Read Also: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత.. గజపతినగరం రైల్వే స్టేషన్ రోడ్డు పురిటిపెంట గ్రామంలో వరినాట్లు వేశారు.. వరి నాట్ల పరిశీనకు పురిటిపెంట విచ్చేసిన మంత్రి అనిత.. రైతులతో ముఖా-ముఖీలో పాల్గొని అనంతరం రైతులతో పాటుగా పంట పొలను పరిశీలించారు.. రైతు కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. రైతులతో కలిసి మడిలో దిగి వరి నాట్లు వేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
