Site icon NTV Telugu

Bhogapuram Airport: కాసేపట్లో భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం..

Bhogapuram

Bhogapuram

Bhogapuram Airport: మరికొద్ది సేపట్లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ట్రైల్ రన్ ప్రారంభం కానుంది. తొలి‌ ఫేజ్ లో 96 శాతం పనులు పూర్తి అయ్యాయి. మొత్తం 2203 ఎకరాలలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం అయింది. తొలి ఫేజ్ లో 6 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. 1. 6 కోట్ల క్యూబిక్ ఎర్త్ వర్క్ చేయటం కష్టతరంగా మారింది. 22 కౌంటర్, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్.. సముద్ర తీర ప్రాంతం కావడంతో నీటిలో నుంచే ఎగిరే చేప ఆకారంలో టెర్మినల్ నిర్మాణం చేశారు. ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఆంధ్ర స్టైల్ లో ముత్యాల ముగ్గులతో సిద్ధం చేశారు.

Read Also: JanaNayaganTrailer : జననాయగన్ రీమెక్ కాదన్నారు.. కానీ భగవంత్ కేసరిని కాపీ పేస్ట్ చేశారు..

అలాగే, ఫ్లోర్ నుంచి సీలింగ్ కు 18 మీటర్లు ఎత్తు ఉంటుంది. గతంలో హుధుద్ తుఫాన్ వచ్చిన నేపథ్యంలో అలాంటి తుఫాన్ లు గంటకు 295 km వేగంతో గాలులు వీచిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణం చేశారు. 270 మిమి వర్షం పడినా ఏం కాదని అధికారులు వెల్లడించారు. టెర్మినల్ అద్దాలు 45 మిల్లి మీటర్ల మందంతో ఉంటాయి. జీఎంఆర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ ఎల్ అండ్ టీ సంస్థ నిర్మాణం చేస్తుంది. ఈ నిర్మాణానికి వాడిన ప్రతి బోల్ట్ కూడా చాలా జాగ్రత్త పరీక్షించారు. బ్యాగేజ్ సిస్టమ్ విషయంలో అనేక అధునాతన చర్యలు చేపట్టారు. ఢిల్లీ, గోవా, హైదరాబాద్ విమానాశ్రయాలు కూడా జీఎంఆర్ సంస్థ నిర్మాణం చేసిన నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని హై అండ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పటి వరకు 35 మిలియన్ పని గంటల పాటు కార్మికులు పనిచేశారు.

Exit mobile version