NTV Telugu Site icon

Vizianagaram MLC By Election Cancelled: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ఈసీ.. ఎందుకంటే..?

Election Commission

Election Commission

Vizianagaram MLC By Election Cancelled: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు అయ్యాయి.. ఇప్పటికే జారీ చేసిన విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘరాజుపై అనర్హత వేటువేశారు శాసన మండలి చైర్మన్‌.. దీంతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది.. అయితే, ఇటీవల మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని తోసిపుచ్చింది హైకోర్టు.. మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.. అంతేకాదు.. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని పేర్కొంది.. దీంతో, ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం..

Read Also: Pushpa 2: రిలీజ్ ముందు దేవి శ్రీ బాంబ్?

Show comments