NTV Telugu Site icon

Saipriya Incident: సాయిప్రియ ఉదంతంపై దర్యాప్తు

Sai Viazg

Sai Viazg

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వివాహిత సాయిప్రియ వ్యవహారంలో ట్విస్ట్ అందరినీ విభ్రాంతికి గురిచేసింది. సముద్రంలో గల్లంతయిందని భావించిన హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందుకు కోటి వరకూ ఖర్చయింది. ఇదిలా వుంటే సాయిప్రియ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ట్విస్ట్ లు సీరియల్స్, సినిమాల స్క్రీన్ ప్లే ని తలపించింది. భర్తని కాదని ప్రియుడితో వెళ్ళిపోయింది.. బెంగళూరులో మూడుముళ్ళు వేయించుకుంది. ఈ వ్యవహారంపై విశాఖ త్రీ టౌన్ సీఐ రామారావు మాట్లాడారు.

Bear in Public Place: జనగామలో ఎలుగుబంటి సంచారం.. భయందోళనలో గ్రామం

సాయి ప్రియ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశాం. సాయి ప్రియ మొబైల్ స్వాధీనం చేసుకొని అందులో ఉన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. అప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అన్ ఇన్ స్టాల్ చేసి ఉన్నాయి. సాయి ప్రియ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన రవి అనే యువకుడు నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టింది. 26న రవి అనే యువకుడి నెంబర్ నెల్లూరు లో ఉన్నట్లు ట్రేస్ చేసాం అన్నారు సీఐ రామారావు.

రవి అనే యువకుడితో పరిచయం ఎప్పటి నుండి ఉందనేది తల్లిదండ్రులు చెప్పడం లేదన్నారు. రవి సాయి ప్రియ ఉంటున్న ఏరియాలోనే ఉండేవాడు. రవి ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రూఫ్ నెల్లూరు లో తీసుకున్నట్లు గుర్తించాం. నెల్లూరు మీదుగా బెంగళూరు వెళ్లినట్లు గుర్తించాం. వారిద్దరూ మేజర్లు, పెళ్లి చేసుకున్నట్లు ఫొటోస్, ఆడియో మెసేజెస్ పంపించారు. ఇప్పటి వరకు అయితే సాయి ప్రియ తల్లిదండ్రులు తన అమ్మాయి విషయంలో మిస్సింగ్ కేసు తప్పితే ఇంకో ఫిర్యాదు ఇవ్వలేదు. సాయి ప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తాం అన్నారు సీఐ రామారావు.