వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
16.12.2021 అంటే నిన్న గురువారం నాడు వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో వి.ఐ.టి – ఎ.పి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) అధ్వర్యంలో 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ సినారియో(ICBTEGS) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ సదస్సు 16న ప్రారంభమై , 18 డిసెంబర్ 2021వరకు వర్చ్యువల్ విధానంలో కొనసాగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సీనియర్ డైరెక్టర్ ఎకనామిక్ యూత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టరేట్, కామన్వెల్త్ సెక్రటేరియట్, యునైటెడ్ కింగ్డమ్ డా|| రూత్ కట్టమూరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ 4వ పారిశ్రామిక విప్లవంలోని అవకాశాలను వివరించారు. దేశాభివృద్ధికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత సంసిద్ధత అవసరమని తెలియజేస్తూ, మల్టీ డిసిప్లినరీ స్టడీస్‌తో యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాయకులను అందించేందుకు వి.ఐ.టి విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందుంటుందని ఆమె కొనియాడారు.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
గౌరవ అతిదిగా హాజరైన సిఇఓ & యండి, యంఎఫ్ యుటిలిటీస్ గణేష్ రామ్ మాట్లాడుతూ గ్లోబల్ సినారియోలో ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ పరివర్తన, యునికార్న్ స్టార్టప్‌లు, క్యాపిటల్ మార్కెట్ గ్రోత్ & డీమ్యాట్ ఖాతాలు మరియు స్టాక్ మార్కెట్, ఫిన్‌టెక్ వృద్ధి గురించి వివరించారు.
అసోసియేట్ డీన్, VSB డా|| రాఘవేంద్ర మాట్లాడుతూ , ఈ సదస్సులో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఎకనామిక్స్ మరియు సంబంధిత అంశాలలో 8 దేశాల నుండి 77 పేపర్లు సమర్పించారని, నార్వే, థాయ్‌లాండ్, సింగపూర్, ఫ్రాన్స్, ఇరాన్ మరియు జింబాబ్వే దేశాలనుండి ఈ సదస్సుకు హాజరయ్యారని తెలియచేసారు. ఈ సదస్సులో వక్తలుగా డా|| జె.ఎం.అరుల్ కామరాజ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంటు అఫ్ సోషల్ వర్క్ లయోలా కాలేజ్, చెన్నై) డా||ఎస్. శ్రీనివాసన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, వినోద్ గుప్త స్కూల్ అఫ్ మేనేజ్మెంట్,ఐఐటి ఖరగపూర్ ) డా|| ఎస్ లలిత (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్, చెన్నై) స్వయంకుమార్ తిబ్రేవాల్(ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి, అసోసియేట్ కన్సల్టెంట్, ఆక్టస్ సలహాదారులు) పాల్గొని ప్రసంగిస్తారని తెలియచేసారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సింగపూరియన్ శివకుమారి (ఉమా) జగదీశన్, గ్లోబల్ సిఓఓ మరియు మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఐ క్యూబ్ కన్సార్టియం సింగపూర్. హాజరవుతారని తెలియచేసారు.
వి.ఐ.టి. – ఏ.పి విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి మాట్లాడుతూ విఐటి ఇంజినీరింగ్‌కు పేరుగాంచిందని, నాన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మరియు హ్యుమానిటీస్ ప్రారంభించామని తెలిపారు.. వి.ఐ.టి – ఎ.పి స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా బిబిఏ జనరల్ మేనేజ్మెంట్, బిబిఏ డిజిటల్ మార్కెటింగ్ (డిజిటల్ స్కాలర్ వారి పారిశ్రామిక సహకారంతో) బిబిఏ 2+2 ప్రోగ్రాం లో భాగంగా మిచిగాన్ విశ్వవిద్యాలయం, డియర్బోర్న్, అమెరికా మరియు అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, అమెరికా లతో ఒప్పందం కుదుర్చుకున్నామని అదే విధంగా బి.కాం ఫైనాన్సు (సి.ఏ ఫౌండేషన్ , మాస్టర్ మైండ్స్ వారి సహకారంతో) అందిస్తున్నామని తెలియచేసారు. అంతే కాకుండా విశ్వవిద్యాలయ ప్రగతి గురించి, వివిధ విభాగాలు, పరిశోధన, ఉపాధి అవకాశాల గురించి వివరించారు మరియు విశ్వవిద్యాలయం పరిశోధన మరియు అభివృద్ధి యొక్క గ్లోబల్ హబ్‌గా మారాలనే లక్ష్యంతో కొనసాగడానికి కట్టుబడి ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా సిఎల్వి శివకుమార్, ఐసీబీటీఈజీ కన్వీనర్ డా ఏవీవీఎస్ సుబ్బలక్ష్మి, ఐసీబీటీఈజీ కో-కన్వీనర్ డా శాలిని రోసలిన్, డైరెక్టర్లు, డీన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!