NTV Telugu Site icon

విశాఖ పోర్టు అరుదైన ఘనత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది. ఈ నెల 26వ తేదీన రికార్డు స్ధాయిలో కార్గోను హ్యాండ్లింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్నర్, ఔటర్ హార్బర్, ఎస్‌పీఎంల నుంచి 3,70,029 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించినట్లు వారు స్పష్టం చేశారు.

Read Also: వాహనదారులకు అలర్ట్… ఇలా వెళ్తే రూ.వెయ్యి జరిమానా

గతంలో ఒక్కరోజులో 3,47,722 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసిన రికార్డును విశాఖ పోర్టు ప్రస్తుతం తిరగ రాసింది. కాగా విశాఖ పోర్టు ఈ అరుదైన రికార్డును సాధించడం పట్ల పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన పోర్టు సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు.