NTV Telugu Site icon

Erra Matti Dibbalu: భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా..

Rajendra Singh

Rajendra Singh

Erra Matti Dibbalu: విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని పరిశీలించారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్.. కనుమరుగైపోతున్న ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియో లాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్ తో కలిసి పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలో అరుదైన ప్రాంతంగా ఎర్రమట్టిదిబ్బలను గుర్తించాలన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం జియో హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించింది వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటాదని. జియో లాజికల్ విద్యార్థులకు ఎర్రమట్టి దిబ్బలను పరిశోధించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు. ఎర్ర మట్టి దిబ్బలలో మొక్కల వేర్లను కూడా అధ్యయనం చేయవచ్చన్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్.

Read Also: PM Mudra Loan: రూ.20లక్షలకు పెరిగిన ముద్రా లోన్.. పూర్తివివరాలు ఇవే..

కాగా, రాజేంద్ర సింగ్.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన వ్యక్తి.. ఆయన.. భారతీయ నీటి సంరక్షణ మరియు పర్యావరణవేత్త . “వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా”గా కూడా పిలుస్తారు, 2001లో మెగసెసే అవార్డును, 2015లో స్టాక్‌హోమ్ వాటర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.. వర్షపు నీటి నిల్వ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు మరియు ఇతర సమయ-పరీక్షలు అలాగే పాత్ బ్రేకింగ్ పద్ధతులు. 1985లో ఒకే గ్రామం నుండి ప్రారంభించి, వర్షాకాలానికి వర్షపు నీటిని సేకరించేందుకు 8,600 జోహాద్‌లు మరియు ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను నిర్మించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైన విషయం విదితమే.