Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Water Dispute Politics Minister Nara Lokesh Makes Fiery Comments On Projects 108 Vizag Steel Plant

Minister Nara Lokesh: జల వివాదంపై మంత్రి లోకేష్‌ హాట్‌ కామెంట్స్‌.. మేం ఎక్కడ చిల్లు పెట్టాం..?

Published Date :January 7, 2026 , 7:19 pm
By Sudhakar Ravula
  • నీటిపై రాజకీయాలు చేయడం సరికాదు..
  • గోదావరి వరద నీటిని రాయలసీమకు లిఫ్ట్ చేస్తాం..
  • తెలంగాణ వాటాకు నష్టం లేదన్న మంత్రి లోకేష్..
  • పట్టిసీమను విమర్శించిన జగన్ అధికారంలో ఉండగానే వాడుకున్నారు..
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు – భూములు కేటాయించం..
Minister Nara Lokesh: జల వివాదంపై మంత్రి లోకేష్‌ హాట్‌ కామెంట్స్‌.. మేం ఎక్కడ చిల్లు పెట్టాం..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Minister Nara Lokesh: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదంపై మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేమిటి?.. మేం అదే నీటిని లిఫ్ట్ చేసి రాయలసీమకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదు కదా? కనీసం కామన్ సెన్స్‌తో ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. నీటి కోసం చిన్న పరిమాణాలకైనా పెద్ద వివాదాలు జరిగాయని గుర్తుచేశారు మంత్రి. ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్య, 10 టీఎంసీల కోసం దేశాల మధ్య కూడా గతంలో వివాదాలు నడిచాయి. సముద్రంలో కలిసే వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి? అని ప్రశ్నించారు.

Read Also: Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!

Also Read

  • Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
  • Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
  • South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్‌ప్రైజ్ గెజిట్..
  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
Add as a preferred
source on google

పట్టిసీమ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం వైఖరిని కూడా ఆయన విమర్శించారు లోకేష్.. పట్టిసీమ దండగ అన్న వైఎస్ జగన్.. ఐదేళ్లు అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్టును ఆపరేట్ చేశారు. 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుపై స్టే వచ్చింది అని అన్నారు. మరోవైపు, తమ పర్యటనల ఖర్చుల విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి లోకేష్. నా పర్యటనల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మేమే పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. నాది, బాబు గారి క్రెడిట్ కార్డు బిల్లులు కూడా అమ్మ, బ్రహ్మణి కడుతున్నారు అని వెల్లడించారు.

108 అంబులెన్స్ సేవలు మూతపడిన సందర్భాన్ని ప్రస్తావించిన మంత్రి లోకేష్‌.. వైసీపీ హయాంలోనే 108 సేవలు మూతపడ్డాయి.. కానీ. NDA హయాంలో ఒక్క సేవ కూడా మూసివేయలేదు అని స్పష్టం చేశారు. మరోవైపు, విశాఖ ఉక్కు (స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. ఉక్కు ప్లాంట్‌కు చెందిన ఒక్క ఎకరం కూడా ప్రైవేట్ లేదా ఇతర అవసరాలకు కేటాయించడం లేదు. అపోహలు వద్దు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడానికి అందరూ సహకరించాలి అని తెలిపారు.

ఇక, విశాఖ ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ ఎవరైనా తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు క్రెడిట్ తీసుకోండి.. నో ఇష్యూ.. కానీ, అమర్ రాజాను తరిమేసినందుకు, ఎయిర్‌పోర్టు భూములు వెనక్కి తీసుకున్నందుకు కూడా వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. క్రీడాకారులను గుర్తించింది కూటమి ప్రభుత్వమే అని వెల్లడించారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో అనుసంధానం చేసి విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిని వేగవంతం చేయాలనే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. అమరావతి, శంషాబాద్ అభివృద్ధి నమూనాను పోల్చిన ఆయన, శంషాబాద్ ఎయిర్‌పోర్టు కట్టినప్పుడు రింగ్ రోడ్ నిర్మాణం జరగలేదు.. కానీ, ఇప్పుడు అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పారు లోకేష్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 108 ambulance NDA vs YSRCP
  • Amaravati progress updates
  • AP Development Projects
  • flood water utilization
  • Fortune 500 land allocation

తాజావార్తలు

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions