Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
- విశాఖలో ఘోర విషాదం
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన పెళ్లి కారు
- పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి దండలతోనే నవ వధువు మృతి చెందగా.. నవ వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన నవ దంపతుల జీవితంలో విషాదం నెలకొనడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. పెళ్లి కార్యక్రమం అనంతరం నవ దంపతులు వాడచీపురుపల్లికి కారులో ప్రయాణిస్తుండగా విశాఖలోని శనివాడ జంక్షన్ దగ్గర మృత్యువు వెంటాడింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న నవ వధువు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మెడలో ఇంకా పెళ్లి దండలు ఉండగానే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
Also Read
- AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
ఇక ఈ ప్రమాదంలో వరుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!