Site icon NTV Telugu

Visakhapatnam: విశాఖ పోలీసుల వినూత్న కార్యక్రమం..

Beggar Free City

Beggar Free City

Visakhapatnam: విశాఖ పోలీసులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ఇకపై విశాఖ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా చూస్తామంటున్నారు విశాఖ పోలీస్ బాస్ శంఖ భ్రత బాగ్చి.. ఇందులో భాగంగా 243 మంది యాచకులను రెస్క్యూ చేసి వారికి ఆశ్రయం కల్పించారు.. జ్యోతిర్గమయ్య కార్యక్రమంలో అమలు చేస్తున్నామని తెలిపారు.. చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేసేందుకు బిక్షాటన చేసే వారికి, నిరాశ్రయులకు షెల్టర్ కల్పించి వారి జీవితాల్లో మరో కొత్త లైఫ్ జర్నీని ప్రారంభించనున్నారు.. రోజు ఎంతో మంది భిక్షాటన చేస్తూ, నిరాశ్రయులుగా రోడ్డు మీద పడుకోవడం తనకు ఎంతో బాధ అనిపించిందని అన్నారు సీపీ… ప్రతి మనిషి మర్యాదగా బతకడానికి ప్రయత్నించేయాలి తప్ప బిక్షాట్న చేయడానికి కాదన్నారు.. నిరాశ్రయులకు షెల్టర్ ఇవ్వడానికి ఎంతోమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు..

Read Also: 79th Independence Day 2025:’ఇది ఐటీ, డేటా కాలం’.. స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, కృత్రిమ మేధస్సును కలిగి ఉండటం అవసరం

Exit mobile version