Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భారీ ప్రమాదం నేపథ్యంలో యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదం అనంతర పరిణామాల నిర్వహణలో లోపాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు పడింది. ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (DGMలు) బదిలీకి గురయ్యారు. వీరిలో కొందరిని హెచ్‌ఆర్ (HR), టౌన్‌షిప్ మెయింటెనెన్స్ వంటి విభాగాల నుంచి ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారనే అభిప్రాయంతోనే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయంపై కార్మిక సంఘాలు కూడా స్పందించాయి. ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అధికారులు సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోయారని, అందుకే ఈ బదిలీలు జరిగాయని యూనియన్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, యాజమాన్యం నుంచి ఈ బదిలీలపై అధికారిక వివరణ ఇంకా వెలువడలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక, అంతర్గత విచారణ ఫలితాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరిన్ని పరిపాలనా చర్యలు ఉండే అవకాశముందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఈ పరిణామాలు ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

×
×
Ad