Site icon NTV Telugu

Visakhapatnam: ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు.. ఫుడ్డే వడ్డింపు..?

Vsp

Vsp

Visakhapatnam: విశాఖపట్నంలో రెస్టారెంట్లు, హోటళ్ల తీరు ఇప్పటికీ మారడం లేదు. అదే పాచిపోయిన ఆహారం, అదే నిల్వ ఉంచిన నాన్ వెజ్ వంటకాలను మళ్లీ మళ్లీ వేడి చేసి కస్టమర్లకు సరఫర చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రెస్టారెంట్లపై అధికారులు కొద్ది రోజుల క్రితం కొరడా ఝులిపించినా, వారి పద్దతిలో ఎలాంటి మార్పు రాలేదు. గత నాలుగైదు రోజుల క్రితం వండిన చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు లాంటి వంటకాలను తిరిగి వేడి చేసి ప్లేట్లలో పెట్టడం రోజువారీ పద్ధతిగా మారిపోయింది. తాజాగా విశాఖలోని ఎంవీపీలో ఉన్న “ఆహా ఏమి రుచులు” రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 85 కిలోల పాచిపోయిన ఫుడ్ దొరికింది.

Read Also: Botsa Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్కు బొత్స సూచన.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కలిసి పోరాడుదాం..!

ఇక, పాచిపోయిన ఫుడ్ ను అధికారులు స్వాధీనం చేసుకుని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత రెస్టారెంట్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, తమ కష్టార్జిత డబ్బును ఖర్చు పెట్టి తింటున్నా, నాణ్యమైన ఆహారం లభించడటం లేదని కస్టమర్లు రెస్టారెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాచిపోయిన ఆహారం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెస్టారెంట్ల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడకుండా.. అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

Exit mobile version