NTV Telugu Site icon

Heavy Rains in Andhra Pradesh: ఏపీలో విస్తారంగా వానలు.. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

Heavy Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఈ సమయంలో తీరం వెంబడి 35- 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.. ఇక, కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.. మరో 48 గంటలపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం..

Read Also: YS Jagan: చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నావైపు చూడండి..

నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుంది.. దాదాపు వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 12 గంటలు నాటికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉందని.. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. దీని ప్రభావంతో శుక్రవారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసోవాలని సూచించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్..

Show comments