Site icon NTV Telugu

Crime News: విశాఖలో కలకలం రేపుతున్న గుర్తు తెలియని మృతదేహలు..

Vsp

Vsp

Crime News: గ్రేటర్ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహలు కలకలం రేపుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకు వెళ్లడం, హత్య చేయడం, ఆనవాళ్లు దొరకకుండా కాల్చి వేయడం హంతకులకు పరిపాటిగా మారింది. అయితే, రెండు నెలలు కిందట ఓ జ్యోతిష్యుడుని ఇదే తరహాలో హత్య చేసిన ఘటన మరువక ముందే పాతికెళ్ళ వివాహిత అతి దారుణంగా హత్యకు గురవ్వడం మరో సంచలనంగా మారిపోయింది.

Read Also: RCB vs CSK: ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీ కన్ను.. నేడు చెన్నైతో ఢీ

అయితే, భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటు చేసుకున్న ఘటనలో వివాహిత మృతదేహం లభించడంతో అనేక అనుమానాలకు కలుగుతున్నాయి. సంఘటన స్థలంలో మద్యం, బీరు సీసాలు పడి ఉన్నాయి. బీరు సీసా గాజుతో గొంతు కోసిన ఆనవాళ్లు, మహిళా మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస మర్డర్లు స్థానికంగా కలకలం రేపుతుంది.

Exit mobile version