విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్