Childrens Missing: విశాఖపట్నంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేపగుంట ముచ్చమాంబ కాలనీకి చెందిన ఈ చిన్నారులు అదృశ్యం అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 31వ తేదీన తన ముగ్గురు పిల్లలు ఆదిత్య సాహు (9), లక్ష్మీ సాహు (7), గొర్లి గంగోత్రి (9) ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని బాధిత తల్లి గొర్లి గౌరీ చెప్పుకొచ్చారు.
Read Also: U-19 World Cup 2025: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్..
అయితే, తల్లి గౌరీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు. ఒడిస్సా బోర్డల్లో చిన్నారులను పెందుర్తి పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ఇంటికి వెళ్ళారా లేక ఎవరయినా తీసుకువెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది. చిన్నారులు ఆదిత్య సాహు, లక్ష్మీ సాహు, గంగోత్రిలను స్టేషన్ కు తీసుకు వస్తున్నారు పోలీసులు.