NTV Telugu Site icon

సింహాచలం ఆలయంలో పాము కలకలం

విశాఖ జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రోజు ఓ పాము భక్తులను హడలెత్తించింది. ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి దుకాణంలోకి పాము దూరడంతో వెంటనే ఆలయ సిబ్బంది పాములు పట్టుకునే ఆలయ ఉద్యోగి కిరణ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు రంగంలోకి దిగి చాకచాక్యంగా పామును పట్టుకుని బంధించడంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు… లోకేష్ ఓ ఆరిపోయే దీపం !

గతంలోనూ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాములు చొరబడ్డాయి. ఈ ఏడాది మే నెలలో ఒక పాము ఆలయంలోని వంటశాలలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అర్చకులు స్వయంగా పామును పట్టుకుని ఆలయానికి దూరంగా విడిచిపెట్టారు.