Gambling in Vizag: విశాఖ నగరంలోని లలిత్‌నగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు కలిసి నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఆరుగురు మహిళలు పోలీసుల చేతికి చిక్కారు. అయితే, ఈ మహిళలు తరచూ గృహాలలో పేకాట ఆడుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక, పేకాట ఆడిన ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి రూ. 22 వేల నగుదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు పోలీసులు.
Read Also: CM Chandrababu: నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు భేటీ.. నేతన్నలతో ముఖాముఖి!
అయితే, ఈ ఘటనకు మూలం స్థానిక వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం. తన భార్య ప్రతిరోజూ పేకాట ఆడుతుందని సదరు భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసినా, వారు పట్టించుకోలేదట. దీంతో అతడు పోలీస్ ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఆ భర్త ఆవేదన విన్న పోలీసు బాస్.. తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని మహిళల పేకాట ముఠా గుట్టను బట్టబయలు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.