Site icon NTV Telugu

Vizag Steel Plant: స్టీల్‌ ప్లాంట్‌లో మరో ఉద్యమం.. ఆర్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి..!

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మరో ఉద్యమం ప్రారంభమైంది.. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్’ కార్యక్రమం ఉధృతంగా మారింది. ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే వారి భూములు తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళనకు దిగారు..

Read Also: Realme Narzo 90 సిరీస్ 5G త్వరలో లాంచ్.. స్పెసిఫికేషన్స్ ఇవే!

నిరసనలో పాల్గొన్న నిర్వాసితులు భారీ సంఖ్యలో ప్లాంట్ మెయిన్ గేటుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో స్టీల్ ప్లాంట్‌కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వాహనాలను ఆపి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైలెన్స్‌కు పాల్పడవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నిర్వాసితులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. “మా న్యాయమైన హక్కులు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదు” అని వారు ప్రకటించారు. భూములు ఇచ్చి నలభై ఏళ్లకు పైగా గడిచినా, వాగ్దానం చేసిన ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆవేదన మరోసారి స్టీల్ ప్లాంట్ గేటు వద్ద హోరెత్తింది.

ప్రధాన డిమాండ్లు:
* ప్రతి ఆర్ కార్డు కలిగిన కుటుంబానికి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం ఇవ్వాలి
* ఉద్యోగాలిచ్చే వరకు జీవనభృతి చట్టం ప్రకారం నెలకు రూ.25,000 భృతి చెల్లించాలి

Exit mobile version