NTV Telugu Site icon

PM Modi: విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది

Pmmodi

Pmmodi

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రూ.10 వేట కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటించినట్లుగా వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఉక్కు రంగానికి ప్రాధాన్యత కల్పించినట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్యాక్టరీ.. ఏపీ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Hombale Films: హోంబలే ఫిల్మ్స్ రూటు మార్చిందే!

విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.