Site icon NTV Telugu

PM Modi in Vizag: విశాఖకు ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం..

Pm

Pm

PM Modi in Vizag: భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు అడుగుపెట్టారు.. ఒడిశా పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద స్వాగతం పలికారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌.. ఇక, ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి రోడ్డు మార్గాన ఐఎన్ఎస్ చోళాకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నౌకాదళ అతిథిగృహానికి వెళ్లి రాత్రికి అక్కడే బసచేయనున్నారు మోడీ. కాగా, రేపు విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఆర్కే బీచ్‌లో రేపు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.. అక్కడ యోగాసనాల్లో పాల్గొంటారు ప్రధాని మోడీ…

Read Also: Congress: ఈ నెల 24న గాంధీ భవన్లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం..

రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.. ఉదయం 6.25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌కు చేరుకోనున్న ఆయన.. ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా విన్యాసాలు చేయనున్నారు.. ప్రధాని మోడీతో పాటు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ భారీ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత ఉదయం 7.50 గంటలకు ప్రధాని ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు చేరుకుంటారు.. అక్కడ ఉదయం 8.15 నుంచి 11.15 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.. అనంతరం ఉదయం 11.25 గంటలకు ఐఎన్‌ఎస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..

Exit mobile version