NTV Telugu Site icon

Gudivada Amarnath:అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే

Gudivada Amarnath

Gudivada Amarnath

టీడీపీ నేతలు, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కుంభకోణాల్లో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి”నారా స్కిల్ స్కామ్” ఉదాహరణ…..ఈ స్కామ్ లో ఇప్పటికే కీలక నిందితులను ED విచారిస్తోంది….అరెస్ట్ అవ్వకుండా మిగిలింది చంద్రబా
బు., ఆయన కొడుకే. సీమెన్స్ తో ట్రై పార్టీ ఒప్పందం….,గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతా బూటకం. ఈ స్కామ్ వెనుక పుత్రరత్నం ప్రమేయం ఉంది. తండ్రి కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారు. ఈ విషయం సీమెన్స్ నిర్ధారించింది.. ఏలేరు స్కామ్., స్టాంప్ పేపర్ల కుంభకోణం.,హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయం అంతా అవినీతి మయం అన్నారు మంత్రి అమర్నాథ్.

Read Also: Today Business Headlines 21-03-23: ఇండియాలో అతిపెద్ద స్టోర్‌ హైదరాబాద్‌లో. మరిన్ని వార్తలు

అవినీతిలో నోబెల్., యాక్టింగ్ లో ఆస్కార్ చంద్రబాబుకు ఇవ్వాలనేది నా ఆకాంక్ష….ఫోరెన్సిక్ ఆడిట్, షాడో ఫైల్స్ ద్వారా స్కిల్ డవలప్ మెంట్ కోసులో పూర్తి ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి.. స్కిల్ స్కామ్ మరో యూరో లాటరీ లాంటి స్కీమ్…..రాజధానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి సంబంధం లేదు. పులివెందులలో లోకేష్ పోటీ చెయ్య గలుగుతాడా…..?3శాతం ఓటర్లు కలిగిన ఒక సెక్షన్ ఓటర్ల ప్రభావం పెద్దగా ఉండదు. పట్టభధ్రుల్లో అసంతృప్తికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాం అన్నారు. లోపం ఎక్కడ ఉందో పసిగట్టి మార్పులు చేసుకుంటాం అన్నారు మంత్రి అమర్నాథ్. ఇండియాకు.,కెన్యాకు మ్యాచ్ జరిగితే అప్పుడప్పుడు కెన్యా గెలుస్తుంది. అంత మాత్రాన కెన్యా బలమైందని చెప్పలేము. గెలుపు ముఖం చూడనందునే టీడీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు.

Read Also: SSMB 28: ఏ క్షణంలోనైనా అప్డేట్ ల్యాండ్ అవ్వొచ్చమ్మా… రెడీగా ఉండండి