Site icon NTV Telugu

Tribal Dead Body in Dolly: మృత దేహాన్ని స్వగ్రామానికి చేర్చాలంటే ఎన్ని కష్టాలు.. డోలి కట్టి వాగు దాటి..!

Dolly

Dolly

Tribal Dead Body in Dolly: ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాజకీయ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు.. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి.. కానీ, గిరిజనుల కృష్టాలు తీరడం లేదు.. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిలను ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే.. మరోవైపు.. కన్నుమూసినవారికి అంత్యక్రియలు నిర్వహించడానికి సొంత గ్రామానికి చేర్చాలన్నా ఆపసోపాలు తప్పడంలేదు..

Read Also: Neeraj Chopra-Manu Bhaker: నీరజ్‌ చోప్రాకు గాయం.. మను బాకర్‌ పోస్ట్ వైరల్‌! ఏంటి సంగతి మను

మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు గిరిజనులకు తిప్పలు తప్పడంలేదు.. పాడేరు మండలం దేవాపురం పంచాయతీ తుమ్మలపాలెం గ్రామానికి చెందిన గాదె నూకరాజు అనే 32 సంవత్సరాల వ్యక్తి.. శనివారం కేజీహెచ్ లో మృతి చెందడంతో ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.. ఈ క్రమంలో అంబులెన్స్ సిబ్బంది గ్రామ సమీపంలో ఉన్న వాగు అవతల వదిలేసి వెనుదిరిగారు.. అయితే, అక్కడి నుంచి స్వగ్రామానికి తరించేందుకు గ్రామస్తులకు ఇక్కట్లు తప్పలేదు. మృతదేహాన్ని అతి కష్టం మీద డోలి కట్టి వాగు దాటించారు.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని, గ్రామానికి సరైన బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గిరిజనులు. మా గిరిజన ప్రాంతంలో ఎవరైనా పుట్టేది ఉన్నా.. చివరకు సచ్చినా తమకు ఈ కష్టాలు తప్పడంలేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Exit mobile version