NTV Telugu Site icon

విశాఖలో ఐటీ దాడుల కలకలం..

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. విశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. భువనేశ్వర్‌ సహా పలు ప్రాంతాల నుంచి ఐటీ అధికారుల టీమ్‌ విశాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో ప్రముఖ బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. విశాఖ కేంద్రంగా పాలన కొనసాగించనున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయించారు. దీంతో.. విశాఖ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ బాగా జరుగుతుందని చెబుతుంటారు. ఈ సమయంలో.. ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.