విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించింది. ఆనంద నిలయంలో విచారణ కొనసాగనుంది. దేవాదాయశాఖ అధికారులను కమిటీ విచారించనుంది.
ఇది కూడా చదవండి: PM Modi: రేపు ఏపీకి మోడీ.. అమరావతి పనులు ప్రారంభించనున్న ప్రధాని
బుధవారం గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. అయితే గోడ ఇటీవలే నిర్మించారు. అయితే గోడ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. హడావుడిగా గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. పిల్లర్లు లేకుండానే గోడ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షానికి గోడ కూలిపోయినట్లుగా సమాచారం. ఆలయ అధికారుల నిర్లక్ష్యంగానే ఇదంతా జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Marco Rubio: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన!
ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, పీఎం నిధి నుంచి రూ.2లక్షల సాయం ప్రకటించారు. అయితే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.
