Site icon NTV Telugu

Heavy Rains: ఉత్తరాంధ్ర లో దంచికొడుతున్న వానలు

Rains

Rains

Heavy Rains: ఉత్తరాంధ్రజిల్లాల్లో ముసురు ముప్పుగా మారుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకు అల్పపీడనం ఏర్పడింది. క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ ప్రకటించింది. అల్పపీడన ప్రాంతం నుంచి రుతుపవన ద్రోణి ఒకటి సంబల్పూర్ మీదుగా వ్యాపించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్త రించింది. దక్షిణ చత్తీస్ ఘడ్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావం వల్ల వ చ్చే ఐదు రోజులు ఉత్తరాంధ్రకు వానగండం పొంచి వుంది. అల్పపీ డనం ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా ఆనందపురం పరిసరాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ వెలవెలబోతోంది. జలపాతాలు ఉధ్రుతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో డుడుమ, చాపరాయి, సరియ వాటర్ ఫాల్స్ మూసివేశారు. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం హెచ్చరికలు ఉత్తరాంధ్రకు వున్నాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇదే పరిస్ధితి వుండే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు నమోదుకానున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదు రుగాలులు వీస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: Khairatabad Ganesh 2025: హైదరాబాద్ ఖా శాన్.. ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ

భారీ వర్షాలు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాన్ని కుమ్మేస్తున్నాయి. దీంతో ఈస్ట్ కో స్ట్ రైల్వే పరిధిలోని జగదల్ పూర్ – విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ రైలును ర ద్దు చేస్తున్నట్టు తూ.కో. ప్రకటించింది. ఇక, భారీ వర్షాల ఉద్రుతికి విశాఖ, ఉప్పాడ దగ్గర సముద్రం అలజడి స్రుష్టిస్తోంది. బాగా ముందుకు చొచ్చుకు వచ్చి భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చాలా చోట్ల తీరం కోతకు గురైపోతోంది. విండ్ డైరెక్షన్ మారడమే ఈ పరిస్ధితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వానలకు విశాఖ గాజువాకలోని వెంకటేశ్వరస్వామివారి ఆలయం రిటైనింగ్ వాల్ కూలిపోయింది. షెడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యా యి. మత్స్యకారులు వేటను నిషేధించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయగా డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలు సంసిద్ధంగా వున్నా యి.

Exit mobile version