Visakhapatnam: విశాఖపట్నంలోని వన్ టౌన్ ఏరియాలో ఐదంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలో కూలిపోతుందో అనే భయం స్థానికుల్లో కొనసాగుతుంది. వెలంపేట, పూల వీధిలో పక్క పక్కనే ఉన్న రెండు భవనాలు పక్కకి ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది ప్లాట్లు ఖాళీ చేయగా, మరి కొందరు ప్రమాదం అని తెలిసిన లోపలే ఉండిపోయారు.
Read Also: Godavari Flood: కోనసీమలో కొనసాగుతున్న వరద ఉధృతి.. పడవల్లో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులు
అయితే, అనుమతులు ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించడం వల్లే ప్రమాదకరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. పిల్లర్లు గోడలు బీటలు వాలడంతో అటువైపు నుంచి వెళ్లడానికి జంకుతున్నారు. 3 అంతస్థుల వరకే పర్మిషన్ ఉంటే.. ఐదంతస్తులు కట్టడంపై కాంట్రాక్టర్ కు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన బిల్డింగును కూల్చివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. భవనం గోడలకు బీటలు రావడంతో.. పరిసర ప్రాంత ప్రజల భద్రత కోసం పోలీసులు భవనం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు.
