Site icon NTV Telugu

Vizag: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

Vizag Betting

Vizag Betting

విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు. ఇంకా తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 8 మంది క్రికెట్ బుకీలను ఇప్పటివరకు పట్టుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 45 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయగా, 80 నకిలీ అకౌంట్లు, బ్యాంక్ పాస్ బుక్కులు గుర్తించారు. త్రీ టౌన్, ఎంవిపి పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని రెండు చోట్ల బెట్టింగ్ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.

Exit mobile version